వికీపీడియా కళ్యాణం

మహాత్మా గాంధీ కుమారుడు దేవదాస్ గాంధీకి, రాజగోపాలాచారి కుమార్తె లక్ష్మికి 1930ల్లో వివాహం జరిగింది. గాంధీ, రాజాజీలతో పాటుగా జాతీయోద్యమ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ పెళ్ళి చాలా నిరాడంబరంగా జరిగింది. గాంధీకి అత్యంత ఇష్టమైన వైష్ణవ జనతో భజనతో ప్రారంభమైన ఈ పెళ్ళిలో వధూవరులు ఖాదీకి సంకేతమైన నూలుదండలు మార్చుకుని పెళ్ళాడారు. జాతీయోద్యమం అత్యున్నత శిఖరాన్ని అందుకున్న దశలో ఇటువంటి గాంధేయ పద్ధతి వివాహాలు జరిగేవి. ఈ పెళ్ళిళ్ళు కాంగ్రెస్ మహాసభలు మొదలుకొని, గాంధీ ఆశ్రమం దాకా పలు సందర్భాల్లో, పలు చోట్ల జరిగేవి. అలానే ద్రవిడోద్యమం, నాస్తికోద్యమం వంటి ఉద్యమాల్లో కూడా పెళ్ళి వేడుకలు, కార్యక్రమాలు ఆయా ఉద్యమాల్లోని సంకేతాలతో, విధానాలతో సమన్వయిస్తూ చేసినవి కనిపిస్తాయి. పెళ్ళి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం, మరపురాని సంఘటన. క్లుప్తంగా చెప్పాలంటే – బిగ్ డే. ఐతే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజును తాము నమ్మే విలువలను ప్రకటించేలా జరుపుకోవడం ఆయా ఉద్యమాల అత్యున్నత స్థాయిలో, విలువలకు పూర్తిగా కట్టుబడ్డ వ్యక్తులు మాత్రమే చేసే పని. ఇదే కోవలో ఈ మధ్య తెలుగు వికీపీడియన్ ప్రణయ్ రాజ్ తన పెళ్ళి వేడుకలు పై వాటిని తలపించాయి. సంవత్సరాలుగా తెలుగు వికీపీడియా స్వచ్ఛంద రచయితగా, వికీపీడియా విలువలను ప్రాచుర్యం చేసే కార్యకర్తగా తెలుగు వికీపీడియాను తన జీవిత విధానంలో భాగంగా చేసుకున్న ఈ తెలుగు నాటక రంగ పరిశోధక విద్యార్థి తన పెళ్ళిని వికీపీడియా వివాహంగా చేసుకున్నారు.

pranay-raj

2013 నుంచి అంతర్జాలంలోనూ, బయటా కూడా వికీపీడియా వ్యాప్తికి కృషిచేస్తున్న ప్రణయ్‌రాజ్ గత అక్టోబరులో 100 వికీడేస్‌ ఛాలెంజ్‌ స్వీకరించారు. ప్రపంచ వ్యాప్తంగా పలువురు వికీపీడియన్లు రోజుకు ఓ వ్యాసం చొప్పున వందరోజుల పాటు వంద వ్యాసాలు సృష్టించే 100 వికీడేస్‌ ఛాలెంజ్‌లో పాల్గొంటూండగా తానూ తెలుగు వికీపీడియాలో ఈ ఛాలెంజ్ స్వీకరించి 100 రోజుల్లో నిర్విఘ్నంగా పూర్తిచేశారు. ఆపైన దాన్ని ఆపకుండా వికీపీడియా ప్రపంచంలో తొలి వికీ వత్సరాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణా ప్రాంతపు సంస్కృతి, చరిత్రలను గురించి రోజుకో వ్యాసం చొప్పున రాస్తూ తన వికీవత్సరంలో 177వ రోజుకు చేరుకున్నారు. ఈ వికీవత్సరంలోని 161వ రోజే తన పెళ్ళి అవడంతో, ప్రారంభించిన వికీ సంవత్సరాన్ని ఆరోజున ఆపడం కాకుండా ఆరోజు పెళ్ళి మండపం నుంచి తెలుగు వికీపీడియాలో “తెలంగాణా యువ నాటకోత్సవం” వ్యాసాన్ని రాశారు. తన భార్య బేతి రాణికి తెలుగు వికీపీడియాలో రాయడం పట్ల ఆసక్తి కలిగించి ప్రోత్సహించడంతో ఆమె పెళ్ళినాడే తెలుగు వికీపీడియాలో ఖాతా సృష్టించుకున్నారు. జనగాంలో ఫిబ్రవరి 15న జరిగిన ఈ పెళ్ళి విభిన్నంగా జరుపుకోవడం పట్ల పలు భాషల వికీపీడియన్లు, బంధుమిత్రులు ఆసక్తి కనబరిచారు. తెలుగు వికీపీడియాకు తాను భవిష్యత్తులోనూ సేవలు కొనసాగిస్తానని, దీన్ని సమాచారం పరంగానూ, సభ్యుల పరంగానూ విస్తరించడంలో తన వంతు కృషిచేస్తానని ప్రణయ్ తెలిపారు.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s